కల్కి ట్రైలర్ పై జక్కన్న ప్రశంసలు

s s rajamouli praises on kalki 2898 ad movie trailer

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో కల్కి 2898ఏడి రాబోతుంది. మహాభారతంతో మొదలై 2898 ఏడీ సంవత్సరంలో ముగుస్తుంది ఈ కథ. ఈసినిమా జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్ట‌ర్స్, టీజ‌ర్, ట్రైల‌ర్ ఈ సినిమాపై అంచనాల‌ను అమాంతం పెంచేశాయి. తాజాగా సెకండ్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ మరింత ఆకట్టుకుంది. సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు ఈట్రైలర్ పై దర్శక ధీరుడు రాజమౌళి స్పందించి ప్రశంసలు కురిపించారు. ప‌వ‌ర్ ప్యాక్డ్ ట్రైల‌ర్ ఇది.. ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలన్న ఉత్సుకతను ఈ ట్రైలర్ పెంచింది.. డార్లింగ్ ప్రభాస్, దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్ పాత్రలు చాలా డెప్త్ గా ఉన్నట్టు కనిపిస్తుంది.. కమల్ సార్ లుక్ అయితే ఇంకా మరిచిపోలేకపోతున్నా.. నాగి నీ కల్కి ప్రపంచంలోకి రావడానికి వెయిట్ చేయలేపోతున్న అంటూ పోస్ట్ లో పేర్కొన్నాడు. ఇప్పుడు రాజమౌళి పోస్ట్ వైరల్ గా మారింది.

కాగా ఈసినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో మరొక హీరోయిన్ బాలీవుడ్ యంగ్ బ్యూటీ దిశా పటానీ కూడా నటిస్తుంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేంద్రప్రసాద్‌, పశుపతి,శోభన, మాళవిక పలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.