పుష్ప కు జయమ్మ ఆహ్వానం

varalakshmi sarath kumar invites allu arjun to the wedding

టాలెంటెడ్ యాక్ట్రెస్ వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రస్తుతం పెళ్లి పనులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. నికోలాయ్ సచ్ దేవ్ అనే వ్యక్తితో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య తన నిశ్చితార్ధం మార్చిలో జరిగింది. జూలైలో వీరి వివాహం జ‌రుగ‌నున్న‌ట్లు స‌మాచారం. ఇక త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న నేపథ్యంలో పెళ్లి పిలుపులతో బిజీ అయిపోయింది. ఇప్పటికే తెలుగు, తమిళ్ కు సంబంధించిన పలువురు సెలబ్రిటీలను కలిసి ఆహ్వాన పత్రికను అందించింది. ఆ ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు తాజాగా పుష్పకు ఆహ్వానం అందింది. తాజాగా అల్లు, అర్జున్ ఇంకా అల్లు అరవింద్ ను తనకు కాబోయే భర్తతో కలిసి వెళ్లి పెళ్లి ఆహ్వాన పత్రికను అందించారు. ఇప్పుడు ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా తమిళ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కెరీర్ ను స్టార్ట్ చేసినా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే ఎక్కువ బిజీ అయిపోయింది వరలక్ష్మీ శరత్ కుమార్. ఇప్పుడు తమిళ్ లో కంటే తెలుగులోనే ఎక్కువ అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. గోపీచంద్ క్రాక్ మూవీతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది వరలక్ష్మీ శరత్ కుమార్. ఆ తరువాత వరుసగా సినిమాలను అందిపుచ్చుకుంటూ కెరీర్ లో దూసుకుపోయింది. హనుమాన్ తో ఈ ఏడాది వరలక్ష్మి మరో సక్సెస్ ను అందుకున్నారు. ప్రస్తుతం అయితే పలు సినిమాలు తన లిస్ట్ లో ఉన్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.