సుందర్ సి దర్శకత్వంలో వచ్చిన అరణ్మనై హార్రర్ వెబ్ సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో మూడు సినిమాలు రాగా ఈఏడాది నాలుగో సిరీస్ వచ్చింది. మొదటి రెండు పార్ట్ లు మంచి విజయాన్ని అందించినా మూడో పార్ట్ మాత్రం అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయింది. కానీ నాలుగో పార్ట్ మత్రం బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. మే 3వ తేదీన ప్రేక్షకుల ముందుక వచ్చింది ఈసినిమా. తెలుగులో బాక్ అనే టైటిల్ తో రిలీజ్ అయింది. ఇక తమిళ్ లో అయితే ఏకంగా 100 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమా ఓటీటీ రిలీజ్ అప్ డేట్ వచ్చేసింది. ఈసినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు సొంతం చేసుకున్నారు. ఇప్పటికే ఓటీటీ రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. జూన్ 21వ తేదీన రిలీజ్ కానుందని తెలిపారు. దీనిలో భాగంగానే ఈసినిమా నేటి నుండి స్ట్రీమింగ్ కు వచ్చేసింది. తమిళ్, తెలుగు, మలయాళం ఇంకా కన్నడ భాషల్లో ఈసినిమా ఇంగ్లీష్ టైటిల్స్ తో అందుబాటులోకి వచ్చింది. మరి ఈ బ్లాక్ బస్టర్ ను థియేటర్లలో చూడని వారు ఓటీటీ లో చూసి ఎంజాయ్ చేయండి..
కాగా ఈసినిమాలో కోవై సరళ, యోగిబాబు,రాజేంద్రన్ కీలకపాత్రల్లో కనిపించారు. ఈసినిమాను కుష్బు సుందర్, ఏసీఎస్ అరుణ్ కుమార్ నిర్మించారు. హిప్ హాఫ్ తమిళ సంగీతం అందించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































