సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా కల్కి 2898ఏడీ. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈసినిమా కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇక్కడ మాత్రమే కాదు విదేశాల్లో కూడా ఈసినిమా కోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈసినిమా ప్రీ సెల్స్ ను చూస్తేనే ఆ విషయం అర్థమవుతుంది. జూన్ 26 వ తేదీన ప్రీమియర్ షోలతో సినిమా స్టార్ట్ కానుంది. ఈనేపథ్యంలోనే నార్త్ అమెరికాలో ఈసినిమా కొత్త రికార్జులు క్రియేట్ చేస్తుంది. నార్త్ అమెరికాలో ప్రీ సేల్స్ తోనే 2 మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరిపోయింది ఈసినిమా. దీంతో వేగంగా 2 మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరిన చిత్రంగా కల్కి నిలిచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
జున్ 27వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ కు కొద్దిరోజులు మాత్రమే ఉండటంతో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్ లను రిలీజ్ చేయగా అవి ఆకట్టుకున్నాయి. మరోవైపు మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే భైరవ యాంథమ్ ను కూడా తాజాగా రిలీజ్ చేశారు. ఈపాటకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
కాగా ఈసినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో మరొక హీరోయిన్ బాలీవుడ్ యంగ్ బ్యూటీ దిశా పటానీ కూడా నటిస్తుంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేంద్రప్రసాద్, పశుపతి పలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీదత్ దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి తోట రమణి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























