టాలీవుడ్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన తాజా చిత్రం ‘కన్నప్ప’. భక్తిరస ప్రధానంగా రూపొందిన ఈ సినిమాకి బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద విష్ణు తండ్రి, సీనియర్ నటుడు డా.మోహన్ బాబు నిర్మించారు. ఇక ఈ చిత్రంలో దేశవ్యాప్తంగా పలు ఇండస్ట్రీలకు చెందిన నటీనటులు భాగమయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మోహన్ లాల్, కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్, ప్రీతి ముకుందన్, కాజల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంయుక్తంగా సంగీతం అందించారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు కన్నప్ప చిత్రం నుంచి టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మేరకు టీజర్ లాంచ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు.
ఈ సందర్భంగా దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. “కన్నప్ప సినిమాలో నాకు నా ఆర్టిస్టులే బలం. విష్ణు చేసిన యాక్టింగ్, పడిన కష్టం గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. గడ్డ కట్ట చలిలోనూ టీం అంతా చలించకుండా పని చేసింది. విష్ణు గారు, శరత్ కుమార్ గారు, మోహన్ బాబు గారు అంత డెడికేటెడ్‌గా పని చేశారు. ప్రతీ ఒక్కరూ అద్భుతంగా నటించారు” అని చెప్పారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “నా అంచనాలని మించి నటించారు. రామాయణం, మహాభారతం మైథాలజీ కాదు.. అది మన చరిత్ర. సౌత్, నార్త్ అని ఉండదు. ఓ భక్తుడి కథను చెప్పాం. మనం దేవుడి దగ్గరకు వెళ్లి కోరికలు కోరుతాం. కానీ ఏం కోరకుండా దేవుడికే నేత్రాలను సమర్పించారు కన్నప్ప. అలాంటి గొప్ప భక్తుడి కథను చెప్పాం. అంతకంటే గొప్ప కథ ఇంకెక్కడ దొరుకుతుంది’ అని అన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























