జీవి ప్రకాష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళ్ లో, తెలుగులో పలు సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ను అందించాడు. ఇక ప్రస్తుతం పలు సినిమాలకు సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. అందులో మోస్ట్ అవైటెడ్ సినిమాస్ లక్కీ భాస్కర్ ఇంకా తంగలాన్ సినిమాలు కూడా ఉన్నాయి. జీవీ ప్రకాష్ తాజాగా తన సోషల్ మీడియా ద్వారా ఈసినిమాల గురించి స్పందిస్తూ.. లక్కీ భాస్కర్, తంగలాన్ సినిమాల ఫస్ట్ సింగిల్స్ రెడీ అయిపోయాయి.. ప్రొడ్యూసర్స్ కు కూడా హ్యాండ్ ఓవర్ చేశారను.. త్వరలోనే రెండు పాటలకు సంబంధించిన అప్ డేట్లు రానున్నాయి అంటూ తెలిపాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా విక్రమ్ హీరోగా వస్తున్న తంగలాన్ సినిమా పా రంజిత్ దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ సినిమాగా కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లోని గనుల్లో పనిచేసే కార్మికుల జీవితం ఆధారంగా ఈసినిమా రాబోతుంది. ఈసినిమాలో పార్వతి తిరువొత్తు, డేనియల్ కాల్టాగిరోన్, మాళవిక మోహనన్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు.
దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరీ దర్శకత్వంలో లక్కీ భాస్కర్ అనే సినిమా వస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈసినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాను సితారా ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చూన్ 4 సినిమాస్ బ్యానర్ పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























