టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్సేన్ హీరోగా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. కృష్ణచైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విశ్వక్ సరసన నేహా శెట్టి, అంజలి హీరోయిన్లుగా నటించారు. మే 31న విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చినా కలెక్షన్ల పరంగా మంచి వసూళ్లనే రాబట్టింది. ఇక జూన్ 14న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో విశ్వక్ సేన్ తన తదుపరి సినిమాపై అప్పుడే దృష్టి సారించాడు. ఈ క్రమంలో ఆయన ప్రధానపాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం ‘మెకానిక్ రాకీ’ #VS10 ప్రాజెక్టుగా తెరకెక్కుతోంది. రవితేజ ముళ్లపూడి తొలిసారి దర్శకత్వం వహిస్తుండగా.. ‘గుంటూరు కారం’ ఫేమ్ మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఇప్పటికే లాంఛ్ చేసిన పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది.
అదేంటంటే..? ‘మెకానిక్ రాకీ’ ఆలిండియా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ప్రముఖ సంస్థ దక్కించుకుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్, ఏషియన్ సినిమాస్ సంయుక్తంగా ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రకటించారు. కాగా ఈ మూవీని ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మిస్తుండగా.. జేక్స్ బిజోయ్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఇక ఇదిలావుండగా విశ్వక్ సేన్ మరోవైపు రామ్ నారాయణ్ దర్శకత్వంలో #VS12 చిత్రంలో నటిస్తున్నాడు. ‘భగవంత్ కేసరి’ చిత్రాన్ని నిర్మించిన షైన్ స్క్రీన్స్ బ్యానర్ దీనిని తెరకెక్కించనుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























