సౌత్ టాప్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో సినిమా చేయనున్నాడని తెలిసిందే. సికిందర్ అనే టైటిల్ తో రానుంది.ఈసినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించనుండగా టాప్ ప్రొడ్యూసర్ సాజిద్ నడియాడ్వాలా నిర్మించనున్నాడు.ఈసినిమా సెట్స్ మీదకు వెళ్ళడానికి రెడీ అవుతుంది.ఈనెల 18నుండి ముంబై లో మొదటి షెడ్యూల్ స్టార్ట్ కానుంది. ఈ షెడ్యూల్ లో ఎయిర్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.వచ్చే ఏడాది ఈద్ కు సికిందర్ రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక సల్మాన్ చివరి సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది దాంతో ఎలాగైనా సికిందర్ తో భారీ హిట్ కొట్టి సల్మాన్ ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు.మరోవైపు మురగదాస్ సికిందర్ తోపాటు తమిళం లో శివ కార్తికేయన్ తో కూడా సినిమా చేయనున్నాడు.త్వరలోనే ఆ సినిమాకూడా సెట్స్ మీదకు వెళ్లనుంది.
ఇక సికిందర్ హీరోయిన్ రష్మిక మందన్న వరస సినిమాలతో ఫుల్ బిజీ గా వుంది.తెలుగులో ప్రస్తుతం రష్మిక పుష్ప 2, హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ గర్ల్ ఫ్రెండ్ తోపాటు కుబేర లో ధనుష్ సరసన నటిస్తుంది.ఈసినిమాలో కింగ్ నాగార్జున కీలక పాత్ర చేస్తుండగా శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































