గత ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు న్యాచురల్ స్టార్ నాని. అందులో దసరా మూవీ బ్లాక్ బస్టర్ హిట్ ను అందించగా.. హాయ్ నాన్న సినిమా డీసెంట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఈఏడాది మరో సినిమాతో రాబోతున్నాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరోగా రాబోతున్న సినిమా సరిపోదా శనివారం. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. హైదరాబాద్ లో వేసిన ఒక భారీ సెట్ లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా నుండి ఒక సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇవ్వబోతున్నట్టు ఇప్పటికే చిత్రయూనిట్ నిన్న అప్ డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక చెప్పినట్టే ఈసినిమా నుండి అప్ డేట్ వచ్చేసింది. ఈసినిమా ఫస్ట్ సింగిల్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఫస్ట్ సింగిల్ ను జూన్ 15వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
కాగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో తమిళ్ టాలెంటెడ్ నటుడు ఎస్ జే సూర్య కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ పై నిర్మిస్తున్నారు. సెన్సేషనల్ కంపోజర్ జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా, మురళి జి సినిమాటోగ్రాఫర్, కార్తీక శ్రీనివాస్ ఎడిటర్. ఈ పాన్ ఇండియా చిత్రం ఆగస్టు 29, 2024న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































