చాలా గ్యాప్ తరువాత విష్ణు మంచు తన డ్రీమ్ ప్రాజెక్ట్ తో వచ్చేస్తున్నాడు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో విష్ణు మంచు ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా కన్నప్ప. మహాశివుడి పరమ భక్తుడు భక్త కన్నప్ప జీవిత నేపథ్యంలో ఈసినిమాను రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. సినిమా షూటింగ్ ను ఎక్కువభాగం విదేశాల్లోనే పూర్తిచేస్తున్నారు. ఇప్పటికే కొంతమేరకు సినిమా షూటింగ్ ను కూడా పూర్తిచేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే ఈసినిమా టీజర్ ను కేన్స్ వేదికగా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. అక్కడ ఇంటర్నేషనల్ ఆడియన్స్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక ఇక్కడ మే 30 వ తేదీన రిలీజ్ చేస్తానని చెప్పారు. కానీ ఆ రోజున రిలీజ్ చేయలేదు. ఇప్పుడు తాజాగా మరో కొత్త డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించాడు విష్ణు. జూన్ 14వ తేదీన కన్నప్ప టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.
After an overwhelming reception at Cannes, I am thrilled to share the teaser for this epic tale, ‘Kannappa’, with you on 14th June. This film holds a special place in my heart, and I can’t wait to welcome you all to the captivating world of #Kannappa🏹. #kannappateaser… pic.twitter.com/bhmCEi6K4s
— Vishnu Manchu (@iVishnuManchu) June 7, 2024
కాగా ఈసినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పాటు కాజల్, మోహన్ లాల్, కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్, ప్రీతి ముకుందన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను అవా ఎంటర్టైన్మెంట్ ఇంకా 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై మంచు విష్ణు తండ్రి, సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నారు. మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంయుక్తంగా ఈసినిమాకు సంగీతం అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























