టాలీవుడ్ యంగ్ హీరో రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా డబుల్ ఇస్మార్ట్. ఈసినిమా ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా ఒకపక్క షూటింగ్ ను పూర్తిచేసుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. రీసెంట్ గానే ఈసినిమా టీజర్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ అయితే సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. టీజర్ ను బట్టి రామ్ ఈసినిమాలో కూడా డబల్ మాస్ తో వచ్చేస్తున్నట్టు అర్థమైపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా చిత్రయూనిట్ షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. తాజాగా ఈసినిమా షూటింగ్ కు సంబంధించిన అప్ డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం అయితే ముంబైలో షూటింగ్ జరుగుతుంది. అక్కడ రామ్ పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. మరో రెండు రోజులు అక్కడే షూటింగ్ జరుపుకోనుందట.. ఆ తరువాత క్లైమాక్స్ ను షూట్ చేయనున్నారుట.. సంజయ్ దత్, రామ్ పై క్లైమాక్స్ ను తెరకెక్కించనున్నారట. అనంతరం ఈ సినిమాలోని బ్యాలెన్స్ సాంగ్ పూర్తి చేస్తారట.
కాగా ఈసినిమాలో ఇంకా బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను పూరి కనెక్ట్స్ పై పూరీ జగన్నాథ్, ఛార్మి కలిసి నిర్మించనున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























