యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్. శంకర్ కాంబినేషన్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ మరియు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం ‘భారతీయుడు 2’. కాజల్ అగర్వాల్ హీరోయిన్‍గా నటిస్తుండగా.. సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్ సింగ్, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న ఈ చిత్రం గ్రాండ్ లెవల్లో రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ‘భారతీయుడు 2’ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్మెంట్స్ ఎల్ఎల్‌పి, సీడెడ్ హక్కులను శ్రీలక్ష్మి మూవీస్ సంస్థలు దక్కించుకున్నాయి. ఈ మూవీ పాటలు సోనీ మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం చెన్నైలో సినీ ప్రముఖులు సమక్షంలో ఆడియో వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు హీరో శింబు, డైరెక్టర్ లోకేష్ కనకరాజ్, నెల్సన్, నిర్మాత ఏ ఎం రత్నం, ఏసియన్ సినిమాస్ సునీల్ నారంగ్, భరత్ నారంగ్ వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
ఈ సందర్భంగా ఈ మూవీలో హీరోయిన్‍గా నటించిన కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ.. ‘ఇండియన్ 2లో నటించడం బెస్ట్ ఎక్స్‌పీరియెన్స్. శంకర్ గారి దర్శకత్వంలో పని చేయడం గొప్ప విషయం. నా కల నిజమైనట్టుగా అనిపిస్తోంది. కమల్ హాసన్ గారు నటనకు ఇన్‌స్టిట్యూషన్ లాంటి వ్యక్తి. అలాంటి ఆయనతో నటించడం నా అదృష్టం, ఎంతో గొప్పగా అనిపిస్తుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన లైకా సుభాస్కరన్ గారికి థాంక్స్. ఈ చిత్రం గొప్ప విజయాన్ని సాధిస్తుంది’ అని అన్నారు.
ఇక ఈ చిత్రంలో నటించిన మరో హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. ‘కమల్ హాసన్ గారి సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయన చిత్రంలో నటించినందుకు చాలా ఆనందంగా ఉంది. అంత సీనియర్ యాక్టర్ అయి ఉండి కూడా ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. శంకర్ గారి దర్శకత్వంలో పని చేయడం సంతోషంగా ఉంది. ఇదొక గొప్ప సినిమా కాబోతోంది’ అని అన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























