ఒకే ఒక జీవితంతో డీసెంట్ హిట్ కొట్టి గ్యాప్ తీసుకున్న యంగ్ హీరో శర్వానంద్ మనమే అంటూ పలకరించడానికి రెడీ అవుతున్నాడు.శ్రీరామ్ ఆదిత్య డైరెక్ట్ చేసిన ఈసినిమా మరో ఆరు రోజుల్లో థియేటర్లలోకి రానుంది.మనమే విజయంపై శర్వా చాలా కాన్ఫిడెంట్ గా వున్నాడు.ఈరోజు రిలీజైన ట్రైలర్ కూడా ప్రామిసింగ్ గా అనిపించింది దాంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాలో ఏకంగా 16 సాంగ్స్ వున్నాయట.మాములుగా ఇప్పుడు వస్తున్న సినిమాల్లో 6 పాటలు ఉండడమే గొప్ప అనుటుకుంటే ఇందులో ఏకంగా 16పాటలు వున్నాయట. ఈవిషయాన్ని శ్రీ రామ్ ఆదిత్య వెల్లడించాడు. మ్యూజిక్ తో డ్రైవ్ అయ్యే సినిమా ఇది. హాయ్ నాన్న ఫేమ్ హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించాడు.మరి ఇన్ని సాంగ్స్ వున్న ఈసినిమాను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
ఈసినిమాలో శర్వాకు జోడీగా కృతి శెట్టి నటించింది. చాలా గ్యాప్ తరువాత కృతి మళ్ళీ తెలుగులో చేసింది.ఈసినిమా విజయం తన కెరీర్ కు కీలకం కానుంది.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈసినిమాను నిర్మించింది.ఈ నిర్మాణ సంస్థకు కూడా మనమే సక్సెస్ తప్పనిసరి కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























