డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని తన ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ పలు సినిమాలను రిలీజ్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ ఏడాది ఇప్పటికే ‘బేబి’, ‘గుంటూరు కారం’, ‘హనుమాన్’, ‘గామి’, ‘ఓం భీమ్ బుష్’, ‘టిల్లు స్క్వేర్’ వంటి సూపర్ హిట్ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసి డిస్ట్రిబ్యూటర్ గా సక్సెస్ ఫుల్ జర్నీ చేస్తున్నారు. ఇక రీసెంట్ గా ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ భజే వాయు వేగం సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను కూడా సొంతం చేసుకుంది. ఈసినిమా ఈరోజు రిలీజ్ అయి మంచి టాక్ ను సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు ఇదే జోష్ తో మరో సినిమా హక్కులను సొంతం చేసుకుంది. కాజల్ హీరోగా వస్తున్న లేడీ ఒరియెంటెడ్ మూవీ సత్యభామ. ఎన్నో సార్లు వాయిదా పడిన అనంతరం ఈసినిమా ఫైనల్ గా జూన్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, ట్రైలర్ రిలీజ్ అవ్వగా వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇక ఈసినిమా ఆంధ్ర, సీడెడ్ హక్కులను ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా తెలియచేసింది.
The renowned #DeerajMogilineniEntertainment will release #Satyabhama in Andhra Pradesh and Ceded, distributed by @DheeMogilineni ❤️🔥
Grand release on June 7th.#SatyabhamaTrailer💥
▶️ https://t.co/WN3CqsE2cp‘𝐐𝐮𝐞𝐞𝐧 𝐨𝐟 𝐌𝐚𝐬𝐬𝐞𝐬’ @MSKajalAggarwal @Naveenc212… pic.twitter.com/yFePLtMZSJ
— Aurum Arts Official (@AurumArtsOffl) May 31, 2024
కాగా క్రైమ్ థ్రిల్లర్ కథాంశంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తుస్తున్నారు.నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్షవర్ధన్, రవివర్మ, అంకిత్ కొయ్య, సంపద ఎన్, ప్రజ్వల్ యద్మ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ‘గూఢచారి’ ఫేమ్ శశికిరణ్ తిక్కా స్క్రీన్‌ప్లేతో పాటు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























