విశ్వక్ సేన్ కెరీర్ లో బిగ్గెస్ట్ మూవీ గా వస్తుంది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.ఈసినిమా విజయంపై టీం ఫుల్ కాన్ఫిడెంట్ గా వుంది.విశ్వక్ కు మాస్ లో క్రేజ్ వుండడం సినిమా కూడా అదే జోనర్ కావడం అలాగే ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో ఈసినిమాపై మంచి అంచనాలు వున్నాయి.రేపే ఈసినిమా థియేటర్లలోకి రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాకు హీరోగా ముందు విశ్వక్ ను అనుకోలేదట.శర్వానంద్ ను తీసుకోవాలనుకున్నారట అయితే ఎందుకో శర్వాతో వర్క్ అవుట్ అవ్వలేదు దాంతో ఈ కథ విశ్వక్ దగ్గర ఆగింది.విశ్వక్ ఆటిట్యూడ్ కు కథ కరెక్ట్ గా సెట్ అవ్వడం తో విశ్వక్ వెంటనే ఓకే చెప్పాడట.ఇక గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో మోత అనే స్పెషల్ మాస్ సాంగ్ వుంది.దీనికి మొదట ఈషా రెబ్బాను తీసుకున్నారు అయితే ఒక రోజు షూటింగ్ చేసిన తరువాత ఆమెకు ఆరోగ్యం సహకరించలేక రాలేకపోయింది దాంతో ఈషా స్థానంలో అయేషా ఖాన్ ను తీసుకున్నారట.
కృష్ణ చైతన్య ఈసినిమాను డైరెక్ట్ చేయగా అంజలి,నేహా శెట్టి హీరోయిన్లు గా నటించారు.యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు. నాగవంశీ ,సాయి సౌజన్య నిర్మించారు.ఇక ఈసినిమా హిట్ అయితే దీనికి సీక్వెల్ కూడా రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























