లేడీ డైరెక్టర్ సుధా కొంగర డైరెక్షన్ లో తమిళ స్టార్ హీరో సూర్య తన 43 చేయాల్సివుంది. ఈ కాంబినేషన్ లో ఇంతకుముందు వచ్చిన సురరై పోట్రు ఓటిటి లో బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది దాంతో ఇదే కాంబో లో మరో సినిమా అనేసరికి అంచనాలు భారీగా పెరిగిపోయాయి.అందుకు తగ్గట్లే కాస్టింగ్ ను సెలెక్ట్ చేశారు.నజ్రియా నజీమ్ ,దుల్కర్ సల్మాన్, విజయ్ వర్మ లను కీలక పాత్రలకు ఎంపిక చేశారు.అయితే ఈసినిమా ముందుకు వెళ్లేలా కనిపించడం లేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నిజానికి ఎప్పుడో షూటింగ్ ప్రారంభం కావాలి కానీ స్క్రిప్ట్ లో సూర్య అభ్యంతరాలు తెలుపడంతో వాయిదాపడింది.ఆ తరువాత కొంత సమయం తీసుకొని చేంజెస్ చేసిన సూర్య శాటిస్ఫై అవ్వలేదట. దాంతో సూర్య ఆ సినిమాను పక్కన పెట్టి 44వ సినిమాను స్టార్ట్ చేస్తున్నాడు.ఈ సినిమాను కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేయనుండగా లవ్ లాఫ్టర్ వార్ అనే టైటిల్ తో తెరకెక్కనుంది. అటు సుధా కొంగర కూడా మరో హీరో తో సినిమా చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది.సో సూర్య -సుధా కొంగర కాంబినేషన్ లో ప్రస్తుతానికి సినిమా అయితే లేనట్లే.
ఇక సూర్య రీసెంట్ గానే కంగువా షూటింగ్ ను పూర్తి చేశాడు. శివ డైరెక్షన్ లో వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి. దీపావళికి విడుదలచేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ ఈసినిమాను నిర్మిస్తున్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























