హీరో శర్వానంద్ కు సాలిడ్ హిట్ దక్కి చాలా కాలమే అయిపోయింది. ఆ మధ్య వచ్చిన ఒకే ఒక జీవితం ఒక మోస్తరు విజయాన్ని అందించినా మంచి కమ్ బ్యాక్ ను అయితే ఇవ్వలేకపోయింది. కమర్షియల్ గా ఈసినిమా బాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదు. ఇక ఆ సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకొని ఇప్పుడు మరో సినిమాతో రాబోతున్నాడు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా వస్తున్న సినిమా మనమే. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమా నుండి మరో అప్ డేట్ వచ్చింది. ఈసినిమా నైజాం హక్కులను మరో ప్రముఖ సంస్థ సొంతం చేసుకుంది. ఆ సంస్థ మరేదో కాదు టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ అయిన మైత్రీ మూవీ మేకర్స్ వారు. ఒకపక్క మైత్రీ మూవీ మేకర్స్ వారు సినిమాలు నిర్మిస్తూనే మరోపక్క డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తుంది. ఈనేపథ్యంలోనే తాజాగా ఈ సంస్థ మనమే మూవీ నైజాం హక్కులను సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా తెలియచేసింది.
కాగా ఈసినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























