టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పుత్రోత్సాహంలో ఉన్నారు. ఆయన తనయుడు గౌతమ్ ఘట్టమనేని తాజాగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా జరిగిన కాన్వకేషన్‌లో గౌతమ్ గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నాడు. ఈ కార్యక్రమానికి మహేశ్ బాబు సతీమణి నమ్రత, కూతురు సితారలతో కలిసి హాజరయ్యారు. ఇక ఇందుకు సంబంధించిన ఫొటోలను మహేశ్, నమ్రత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా మహేష్ బాబు, నమ్రత చేసిన పోస్ట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక కుమారుడు గౌతమ్‌తో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన మహేష్ బాబు అందులో ఇలా పేర్కొన్నారు.. “నా హృదయం గర్వంతో పొంగిపోతోంది. నీ గ్రాడ్యుయేషన్‌కు అభినందనలు. తర్వాతి చాప్టర్ నువ్వే రాసుకోవాల్సి ఉంటుంది. ఇకపై నీవు ముందుకంటే ఇంకా మెరుగ్గా ఉంటావని నాకు తెలుసు. నీ కలలను చేధించుకుంటూ ముందుకు వెళ్లు. నిన్ను మేము ఎప్పటికీ ప్రేమిస్తుంటాం. ఈ రోజు తండ్రిగా నిన్ను చూసి ఎంతగానో గర్వపడుతున్నాను’’ అని మహేష్ బాబు తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.
View this post on Instagram
మరోవైపు మహేష్ బాబు చేసిన ఈ పోస్ట్‌కి నమ్రతా శిరోద్కర్ స్పందిస్తూ.. ‘నో వర్డ్స్.. ఓన్లీ లవ్’ అంటూ కామెంట్ చేశారు. ఇంకా ఇన్‌స్టా వేదికగా ఆమె తన సంతోషాన్ని ఇలా తెలియజేశారు. ‘‘మై డియర్ జిజి.. ఇప్పుడు నేను ఎంత గర్వపడుతున్నానో అది నీకు తెలియాలని కోరుకుంటున్నా. నిజాయితీగా ఉంటూ, నీ ప్యాషన్‌ను ఫాలో అవుతూ.. కలలను సాకారం చేసుకుంటావని భావిస్తున్నాను. నిన్ను నేను ఎంతగా నమ్ముతున్నానో అంతకంటే ఎక్కువగా నిన్ను నువ్వు నమ్ము. నీ లైఫ్ నిన్ను ఎక్కడికి తీసుకెళ్లినా.. నా ప్రేమ, మద్దతు ఎప్పుడూ ఉంటాయని తెలుసుకో. నీదైన ఈ రోజుకు అభినందనలు. ఇక నుంచి ఈ ప్రపంచం నీది. లవ్ యూ సో మచ్’’ అని నమ్రత తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
View this post on Instagram
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























