మెగాస్టార్ చిరంజీవి,బింబిసార ఫేమ్ వశిష్ఠ కాంబినేషన్ లో వస్తున్న సినిమా విశ్వంభర.భారీ బడ్జెట్ తో సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది.రీసెంట్ గా భారీ ఇంటర్వల్ బ్లాక్ షూట్ పూర్తి కాగా ఆ తరువాత షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు. ఇక ఇప్పుడు కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది.రేపటి నుండి హైదరాబాద్ లో ఈషెడ్యూల్ ప్రారంభం కానుంది.ఇది కూడా నాన్ స్టాప్ గా జరుగనుంది.దాంతో 70శాతం షూటింగ్ పూర్తి కానుంది.జూలై లోపు షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసి ఆ తరువాత విఎఫ్ఎక్స్ కు ఎక్కువ సమయం తీసుకోనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే ఈసినిమా ఓవర్సీస్ రైట్స్ కూడా అమ్ముడయ్యాయి.ఈసినిమాలో చిరు సరసన త్రిష నటిస్తుండగా సురభి, ఇషా చావ్లా చిరు చెల్లెలు గా కనిపించనున్నారు. ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.విశ్వంభరను యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుండగా సంక్రాంతికి కానుకగా జనవరి 10న విడుదలకానుంది.
ఇక గత ఏడాది చిరుకి సంక్రాంతి బాగా కలిసొచ్చింది.వాల్తేరు వీరయ్య తో వచ్చి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు.మరి విశ్వంభరకు కూడా మరోసారి సంక్రాంతి సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























