ఆస్కార్ అవార్డ్ విన్నర్ మరియు జాతీయ అవార్డు గ్రహీత అయిన ప్రముఖ టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, ప్రజాకవి, గేయ రచయిత డాక్టర్ అందెశ్రీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ మేరకు వారు మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. కాగా తెలంగాణ రాష్ట్రీయ గీతం అయిన ‘జయ జయహే తెలంగాణ’ పాటకు స్వరాలు చేకూర్చే బాధ్యతలను సంగీత దర్శకుడు కీరవాణికి అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే ఆ పాటను రాసిన గేయ రచయిత అందెశ్రీతో కలిసి కీరవాణి నేడు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి.. కీరవాణి, అందెశ్రీలకు జ్ఞాపికలను అందించారు. ఇక సమావేశంలో భాగంగా ముఖ్యమంత్రి వీరికి పలు కీలక సూచనలు అందించారు. త్వరలో వీరి ఆధ్వర్యంలో ‘జయ జయహే తెలంగాణ’ పాట సరికొత్తగా రూపుదిద్దుకోబోతోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పటికే తెలంగాణలో బాగా ప్రాచుర్యంలో ఉన్న ‘జయజయహే తెలంగాణ జననీ జయకేతనం’ అనే పాటను అందెశ్రీ రచించారు. తెలంగాణ లోని విద్యాసంస్థల్లో, ఇతర ప్రభుత్వ, ప్రభుత్వేతర కార్యక్రమాలలో తెలంగాణ గీతంగా, ప్రార్థనా గీతంగా కూడా ఈ పాటను పాడుతున్నారు. ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ పాటను తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























