హీరోగా వరస సినిమాలతో ఫుల్ బిజీగా వున్న నటుడు సుహాస్ నుండి రీసెంట్ గా వచ్చిన సినిమా ప్రసన్నవదనం.ఈఏడాది ఇది తనకు మూడో రిలీజ్.ఈసినిమాకు ముందు సోలో హీరోగా వచ్చిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ హిట్ అనిపించుకుంది.ఈనెల స్టార్టింగ్ లో థియేటర్లలోకి వచ్చిన ప్రసన్న వదనం కూడా పాజిటివ్ రివ్యూస్ తో డీసెంట్ వసూళ్లను రాబట్టుకుంది.ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటిటి లోకి రానుంది.ఆహా ఈసినిమా ను ఈనెల 24నుండి స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది.ఆహా గోల్డ్ వున్న వారు 24గంటల ముందే చూసేయొచ్చు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సుకుమార్ శిష్యుడు అర్జున్ వైకే ఈసినిమాను తెరకెక్కించగా పాయల్ రాధాకృష్ణ హీరోయిన్ గా నటించింది. ఇక ప్రస్తుతం సుహాస్ చేతిలో మరో మూడు సినిమాలు వున్నాయి.అందులో కేబుల్ రెడ్డి ఒకటి. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా విడుదలకు రెడీ అవుతుంది.ఈసినిమా కాకుండా దిల్ రాజు ప్రొడక్షన్స్ లో సుహాస్ ఓ సినిమా చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది. వీటితోపాటు సుహాస్ లీడ్ రోల్ లో ఓ భామ అయ్యో రామ అనే సినిమా కూడా చేస్తున్నాడు.ఇందులో మాళవిక మనోజ్ హీరోయిన్ గా నటిస్తుండగా రామ్ గోదాల డైరెక్ట్ చేస్తున్నాడు.రధాన్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































