తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ డే మే 19న జరుగనున్న విషయం తెలిసిందే. ఘనంగా నిర్వహించనున్న ఈ వేడుకకు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం వేదిక కానుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఇండస్ట్రీకి చెందిన మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, ప్రభాస్, నాగచైతన్య సహా అగ్ర హీరోలు అందరికీ ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. ఈ క్రమంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు దర్శకులు తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ మేరకు శనివారం టీఎఫ్‌డీఏ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినవారిలో దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, రామ్ గోపాల్ వర్మ, అనిల్ రావిపూడి, హరీష్ శంకర్, వశిష్ట మల్లిడి తదితర డైరెక్టర్లు ఉన్నారు. ఈ సందర్భంగా ఆదివారం నిర్వహించనున్న డైరెక్టర్స్ డే కార్యక్రమానికి రావాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందించారు. కాగా టాలీవుడ్ దివంగత దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణరావు జన్మదినం సందర్భంగా.. ప్రతి ఏటా మే 4న దర్శకుల దినోత్సవం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ కార్యక్రమం మే 19కి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో రేపు సాయంత్రం 6 గంటలకు తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ డే వేడుక జరుగనుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























