కల్కి 2898 ఏడీ- ఇంట్రెస్టింగ్ గా ప్రభాస్ బుజ్జి

kalki 2898 ad team revealed about prabhas bujji

బాహుబ‌లి, స‌లార్ వంటి సినిమాల‌తో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు ప్ర‌భాస్‌. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్దమవుతున్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా వస్తుండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇక మే 9వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ అది కాస్తా వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. ఫైనల్ గా జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా నుండి అప్ డేట్ రానున్న సంగతి తెలిసిందే కదా. ప్రభాస్ ముందు అప్ డేట్ గురించి హింట్ ఇచ్చాడు. డార్లింగ్స్ త్వరలోనే ఓ కొత్త పర్సన్ రాబోతోన్నారు.. గుడ్ న్యూస్.వెయిట్ చేయండి అంటూ ప్రభాస్ ఓ పోస్ట్ చేశాడు. ఇక ప్రభాస్ పోస్ట్ పై అనుమానాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆతరువాత అది కల్కి అప్ డేట్ అన్న క్లారిటీ వచ్చింది. ఆ తరువాత ‘డార్లింగ్స్‌.. నా బుజ్జిని మీకు పరిచయం చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అంటూ మరో పోస్ట్ పెట్టాడు. దీంతో ప్రభాస్ పరిచయం చేయబోయే బుజ్జి ఎవరబ్బా అని ఈగర్ వెయిట్ చేశారు. ఇప్పుడు ఆ టైమ్ రానే వచ్చింది. ప్రభాస్ బుజ్జిని పరిచయం చేశారు.

బుజ్జీ అనే వాహనం బాడీని ఓ బ్రెయిన్‍ కంట్రోల్ చేస్తుందంటూ టీమ్ వీడియో రిలీజ్ చేసింది. దీంతో బుజ్జి ఎవరో కాదు ప్రభాస్ వెహికల్ అని అర్థమవుతుంది. బుజ్జీ వాహనాన్ని తయారు చేసేందుకు టీమ్ ఎంత కష్టపడిందో కూడా ఇందులో మేకర్స్ చూపించారు. మే 22న బుజ్జీని పరిచయం చేస్తామని డేట్‍ను కూడా మూవీ టీమ్ ఖరారు చేసింది.

కాగా ఈసినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో మరొక హీరోయిన్ బాలీవుడ్ యంగ్ బ్యూటీ దిశా పటానీ కూడా నటిస్తుంది. కమల్ హాసన్ మరో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వైజయంతి మూవీస్‌ పతాకంపై అశ్వనీదత్‌ దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి తోట రమణి ఆర్ట్‌ డైరెక్టర్‌ గా వర్క్ చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.