సుహాస్ ప్రసన్నవదనం రివ్యూ

Prasana Vadanam movie telugu review

నటీనటులు :సుహాస్,పాయల్ రాధాకృష్ణ,రాశి సింగ్ ,వైవా హర్ష
సినిమాటోగ్రఫీ : చంద్రశేఖరన్ ఎడిటింగ్ : కార్తీక్ శ్రీనివాస్ సంగీతం : విజయ్ బుల్గానిన్ దర్శకత్వం : అర్జున్ వైకే నిర్మాతలు : మణికంఠ, ప్రసాద్ రెడ్డి

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ వరుస సక్సెస్ లతో ప్రామిసింగ్ హీరోగా మారాడు నటుడు సుహాస్.ఈ హీరో నటించిన లేటెస్ట్ మూవీ ప్రసన్నవదనం.ట్రైలర్  ఇంట్రెస్టింగ్ గా ఉండడం అలాగే బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తోసుకోవడం తో ప్రసన్నవదనంకు హైప్ వచ్చింది.మరి ఈరోజే థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా ఎలా వుంది.ఈసినిమా సుహాస్ కు మరో హిట్ ఇస్తుందో లేదో  తెలుసుకుందాం.
కథ : 

రేడియో జాకీ అయిన సూర్య (సుహాస్ ) అనుకోకుండా ఓ ప్రమాదంలో అమ్మా నాన్నలను కోల్పోవడం తోపాటు ఫేస్ బ్లైండ్ నెస్ అనే డిజార్డర్ బారిన పడతాడు. ఈ డిజార్డర్ వల్ల  ముఖాలు గుర్తుపట్టలేడు కానీ వాయిస్ ను గుర్తించగలడు.తనకు ఈ సమస్య ఉందని తన ఫ్రెండ్ వైవా  హర్ష కు తప్ప మిగితా వారికి  తెలియకుండా జాగ్రత్త పడతాడు. అయితే ఈ క్రమంలో సూర్య ,ఆద్య (పాయల్) తో ప్రేమలో పడతాడు. ఇదిలావుండగా ఒకానొక సందర్భంలో సూర్య  కళ్ల ముందే ఓ హత్య జరుగుతుంది. ఆ సంఘటన కాస్త సూర్య ని చిక్కుల్లో పడేస్తుంది.ఇంతకీ ఆహత్య ను ఎవరు చేస్తారు? దానికి సూర్య కు ఏం సంబంధం? చివరికి ఆ మిస్టరీ ఎలా వీడింది అనేది మిగితా కథ.

విశ్లేషణ : 
కథగా చుస్తే చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు.ఫేస్ బ్లైండ్ నెస్ అనే డిజార్డర్ ను తీసుకొని దానికి ఓ థ్రిల్లింగ్ ఎలిమెంట్ ను జోడించి  అంతే ఎంగేజింగ్ గా తెర మీదకు తీసుకురావడం లో డైరెక్ట్ సక్సెస్ అయ్యాడు. డైరెక్టర్ కు ఇది మొదటి సినిమానే అయినా ఎక్కడా తడబడకుండా తను చెప్పాలనుకున్నది చాలా వరకు ఎంగేజింగ్ గా చెప్పాడు.ట్విస్టులు కూడా బాగా రాసుకున్నాడు.ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్  సూపర్ అనిపిస్తుంది.  ఫస్ట్ హాఫ్ లో సుహాస్ కు అలాగే వైవా హర్షకు మధ్య వచ్చే సన్నివేశాలు అలాగే హీరో ,హీరోయిన్ తో ప్రేమలో పడడం వంటి సన్నివేశాలతో సరదాగా సాగిపోతుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్టుతో అసలు కథ ప్రారంభమవుతుంది. ఇక అక్కడ నుండి ఉత్కంఠభరితంగా సాగుతుంది.దాదాపు సెకండ్ హాఫ్ అంతా సీరియస్ మోడ్ లో సాగగా  కొన్ని  సీట్ ఎడ్జ్ సన్నివేశాలు కూడా వున్నాయి.అయితే అక్కడక్కడా కొంచెం స్లో అయిన ఫీలింగ్ కలుగుతుంది అదొక్కటే మైనస్ తప్ప సినిమా  చాలా వరకు మెప్పిస్తుంది.

ఇక నటీనటుల విషయానికి వస్తే సూర్య పాత్రలో సుహాస్ అదరగొట్టాడు.తనకు ఈలాంటి పాత్రలో నటించడం కొత్త కాబట్టి తెరమీద సుహాస్ కొత్తగా కనిపించాడు.హాస్యంతోపాటు భావోద్వాగాలను బాగా పండించాడు. హీరోయిన్ గా నటించిన పాయల్ ,ఆద్య పాత్రలో మెప్పించింది.లీడ్ పెయిర్ మధ్యలో వచ్చే సన్నివేశాలు సరదాగా వున్నాయి.పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన రాశి సింగ్  తన పాత్రకు న్యాయం చేయగా తనకు అలవాటైన పాత్రలో కనిపించిన వైవా హర్ష నవ్వించాడు.
టెక్నికల్ గా కూడా సినిమా ఉన్నతంగా వుంది. చంద్రశేఖరన్ సినిమాటోగ్రఫీ కలర్ ఫుల్ గా వుంది.విజువల్స్ బాగున్నాయి.ఎడిటింగ్  ఓకే.విజయ్ బుల్గానిన్  సినిమాకు ప్లస్ అయ్యింది.ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను ఎలివేట్ చేసింది.నిర్మాణ విలువలు కథకు తగ్గట్లు వున్నాయి.

ఓవరాల్ గా సుహాస్ హీరోగా వచ్చిన ప్రసన్నవదనం చాలా వరకు మెప్పిస్తుంది.కథ,సుహాస్ యాక్టింగ్ ,సంగీతం సినిమాలో హైలైట్ అయ్యాయి. ఓ మంచి  థ్రిల్లింగ్ సినిమాను చూడాలనుకుంటే ప్రసన్నవదనంను చూసేయొచ్చు

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.