టాలీవుడ్ లో విభిన్నమైన పాత్రలు చేసే హీరోల్లో నవీన్ చంద్ర కూడా ముందుంటాడు. నవీన్ చంద్ర కూడా ఏ పాత్రలో అయినా ఒదిగిపోయి నటించగలిగే టాలెంట్ ఉన్న నటుడు. అందాల రాక్షసి సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నవీన్ చంద్ర.. మొదటి సినిమాతోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం పలు సినిమాలతో కెరీర్ ను కొనసాగిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇప్పుడు నవీన్ చంద్రకు అరుదైన ఘనత దక్కింది. ఈ ఏడాది దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. “మంత్ ఆఫ్ మధు” సినిమాలోని ఆయన అద్భుతమైన నటనకు గాను ఈ ప్రతిష్టాత్మకమైన పురస్కారం లభించింది. భారతీయ సినిమా చరిత్రలో దిగ్గజాలైన దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ పేరిట ఇవ్వబడే ఈ అవార్డు అందుకోవడం నవీన్ చంద్ర సత్తా ఏంటో నిరూపించింది. ఈ మంత్ అఫ్ మధు అమెజాన్ ప్రైమ్ అలాగే ఆహలో స్ట్రీమింగ్ అవుతుంది.
🏆 Honored and grateful! 🏆
I am thrilled to announce that I have been awarded the Best Actor (Male) for my role in “Month of Madhu” at the Dada Saheb Phalke Feature Film Festival – 14, held in New Delhi on April 30th, 2024. This recognition means the world to me, and I extend… pic.twitter.com/nSoQ54KZIq
— Actor Naveen Chandra (@Naveenc212) May 1, 2024
కాగా నవీన్ చంద్ర నటించిన “ఇన్స్పెక్టర్ రుషి” వెబ్ సిరీస్ ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. ఈ వెబ్ సిరీస్ కూడా సూపర్ హిట్ అయింది. ప్రస్తుతం నవీన్ చంద్ర “గేమ్ ఛేంజర్” వంటి పాన్ ఇండియా సినిమాతో పాటు మరికొన్ని సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు. ఇంకా తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కుతున్న ఒక మూవీ లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన సరసన వాణీ భోజన్, అమృతా అయ్యర్ నటిస్తున్నట్టు తెలుస్తుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































