ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా పుష్ప2. ఈసినిమా కోసం కేవలం అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం సినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే గ్లింప్స్, పోస్టర్స్ రిలీజ్ చేయడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రీసెంట్గా రిలీజ్ చేసిన టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకొని.. సోషల్ మీడియాలో నంబర్ 1 స్థానంలో టాప్ ట్రెండింగ్‌లో నిలిచి.. సెన్సేషనల్ రికార్డు క్రియేట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా ఫస్ట్ సింగిల్ కు సంబంధించిన అప్ డేట్ ఇప్పటికే వచ్చిన సంగతి తెలిసిందే కదా. పుష్ప పుష్ప అంటూ వచ్చే ఫస్ట్ సింగిల్ ను మే 1వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. దీనిలో భాగంగానే ప్రోమో కూడా ఇప్పటికే రిలీజ్ చేశారు. ప్రోమోకు మంచి రెస్పాన్స్ వచ్చి. ఇప్పుడు ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ ఇంకా బెంగాలీలో కూడా ఈసాంగ్ ను రిలీజ్ చేశారు. చంద్రబోస్ లిరిక్స్ అందించిన ఈపాటను నకష్ అజీజ్, దీపక్ బ్లూ కలిసి పాడారు
Cheer and celebrate the arrival of PUSHPA RAJ with the #PushpaPushpa chant ❤️🔥#Pushpa2FirstSingle out now 💥
Telugu 🎶 – https://t.co/iTjnKxx2VD
Hindi 🎶 – https://t.co/JNNxEj5i91
Tamil 🎶 – https://t.co/e7XBwbkPXP
Kannada 🎶 – https://t.co/Y8DW2cXVTO
Malayalam 🎶 -… pic.twitter.com/4YPi8l7nfj— Mythri Movie Makers (@MythriOfficial) May 1, 2024
కాగా పుష్ప..ది రూల్ కూడా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. రెండో పార్టులో కూడా కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుంది. జగదీష్ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, ధనంజయ, షణ్ముఖ్, అజయ్, శ్రీతేజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.. అలానే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























