ఆడు జీవితం ఖాతాలో కొత్త రికార్డ్

aadu jeevitham movie joins in 100 crore club

మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నుండి వచ్చిన సినిమా ఆడు జీవితం. బ్లెస్సీ దర్శకత్వంలో యధార్థ సంఘటనల ఆధారంగా ఈసినిమాను తెరకెక్కించారు మేకర్స్. 1990లో జీవనోపాధి కోసం కేరళను వదిలి విదేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే యువకుడు అక్క‌డ ఎలాంటి ప‌రిస్థితుల‌ను ఎదుర్కొన్నాడు అనేది సినిమా స్టోరీ. ఈసినిమా రిలీజ్ కు ముందే మంచి బజ్ ను క్రియేట్ చేసుకుంది. ఫైనల్ గా ఎన్నో అంచనాల మధ్య మార్చి 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక రిలీజ్ అయిన ఫస్ట్ షో నుండే మంచి టాక్ ను సొంతంచేసుకుంది. ముఖ్యంగా సుకుమార్ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా ఇప్పుడు మరో మైల్ స్టోన్ ను సొంతం చేసుకుంది. ఈసినిమా 100 కోట్ల క్లబ్ లోకి చేరింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ రూ.100 కోట్లకు పైగా గ్రాస్‌ వసూళ్లను అందుకుందని మూవీ టీమ్ తాజాగా​ ప్రకటించింది. తెలుగులో ఈసినిమా రిలీజ్ అయినా కూడా తెలుగులో పెద్దగా కలెక్షన్స్ ను రాబట్టుకోలేకపోయింది. దీంతో ఒక్క మలయాళం వెర్షన్ లోనే 90 కోట్లు కలెక్ట్ చేసుకుంది. దీంతో ఈ ఏడాది రిలీజై అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళం సినిమాగా ఆడు జీవితం సినిమా కొత్త రికార్డ్ ను క్రియేట్ చేసుకుంది.

కాగా ఈసినిమాలో అమలాపాల్, కేఆర్ గోకుల్, హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో నటించారు. ఏఆర్. రెహ‌మాన్ సంగీతం అందించారు. జెట్ మీడియా ప్రొడక్షన్ మరియు ఆల్టా గ్లోబల్ మీడియా నిర్మించాయి. తెలుగులో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వారు తెలుగులో రిలీజ్ చేశారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.