మా కాంబినేషన్ ఈ సినిమాతో నిజం కాబోతుంది – రామ్ చరణ్

Ram Charan and Janhvi Kapoor Performs Puja For RC16

‘ఆర్ఆర్ఆర్’తో పాన్ ఇండియా రేంజ్‌లో సెన్సేష‌న‌ల్ క్రియేట్ చేసిన గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా.. తొలి చిత్రం ‘ఉప్పెన’తో బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించిన బుచ్చిబాబు సానా కాంబినేష‌న్‌లో భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ RC 16 బుధ‌వారం ఘ‌నంగా ప్రారంభ‌మైంది. ఇందులో రామ్‌ చ‌ర‌ణ్ జ‌త‌గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ న‌టిస్తోంది. వృద్ధి సినిమాస్ బ్యాన‌ర్‌పై వెంక‌ట స‌తీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ‌లు మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్ స‌మ‌ర్ప‌ణ‌లో సినిమా తెరకెక్కుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా అట్టహాసంగా జరిగిన RC 16 ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మానికి మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్, స్టార్ ప్రొడ్యూస‌ర్స్ అల్లు అర‌వింద్, బోనీ క‌పూర్, ఎ.ఆర్‌.రెహ‌మాన్‌, గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, జాన్వీ క‌పూర్‌, చిత్ర ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు సానా, చిత్ర స‌మ‌ర్ప‌కులు సుకుమార్, దిల్ రాజు, శిరీష్, సాహూ గారపాటి, రామ్ ఆచంట, ఎమ్మెల్యే రవి గొట్టిపాటి, నాగవంశీ తదితరులు హాజ‌ర‌య్యారు. ఇక ముహూర్త‌పు స‌న్నివేశానికి మెగాస్టార్ క్లాప్ కొట్ట‌గా బోనీ క‌పూర్ కెమెరా స్విచ్చాన్ చేశారు. శంక‌ర్ గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ చేతుల మీదుగా చిత్ర యూనిట్ స్క్రిప్ట్‌ను అందుకున్నారు.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ ‘‘బుచ్చిబాబుకి సినిమా అంటే పిచ్చి. రంగస్థలంలో సుకుమార్ అసిస్టెంట్ గా తను ట్రావెల్ అయ్యాడు. రంగస్థలం నెరేషన్‌ను సుకుమార్‌గారు నాకు నలబై నిమిషాలే ఇచ్చారు. అయితే అక్కడి నుంచి ప్రతిరోజూ రెండేసి గంటల నెరేషన్‌ను ఇస్తూ వచ్చింది మాత్రం బుచ్చిబాబునే. తనకు ఇంత పిచ్చి ఉంటుందని నేను అనుకోలేదు. ఈ స్టేజ్ పై ఉన్న ప్రముఖులను చూస్తుంటేనే తన సంకల్పం ఏంటో అర్థమవుతుంది. సుకుమార్ గారి దగ్గరున్న టీమ్ లో బుచ్చిబాబు బెస్ట్” అని పేర్కొన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “బుచ్చిబాబు ఉప్పెనతో పెద్ద సక్సెస్ చూశాడు. నేను నాకెరీర్‌లో ఇంత త్వరగా ఎ.ఆర్.రెహమాన్‌గారితో పని చేస్తానని అనుకోలేదు. కచ్చితంగా అద్భుతమైన సినిమా చేస్తామనే నమ్మకం ఉంది. నేను, జాన్వీ కలిసి జగదేకవీరుడు-అతిలోక సుందరి అనే సినిమా చేయాలని చాలా మంది అనుకున్నారు. మా కాంబినేషన్ ఈ సినిమాతో నిజం కాబోతుండటం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్బంగా జాన్వీకి థాంక్స్. మా సూపర్ హిట్ ప్రొడ్యూసర్స్ మైత్రీ మూవీ మేకర్స్‌కి, నిర్మాత సతీస్ కిలారుకి, మా టెక్నికల్ టీమ్‌కి థాంక్స్’’ అని అన్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.