టాలీవుడ్ యంగ్ అండ్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన విజువల్ వండర్ ‘హనుమాన్’. యువ నటుడు తేజ సజ్జా హీరోగా నటించగా శ్రీమతి చైతన్య సమర్పణలో ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్పై కె నిరంజన్ రెడ్డి నిర్మించారు. సంక్రాంతి కానుకగా ఈ ఏడాది జనవరి 12న విడుదలై ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. పండుగ బరిలో పలు స్టార్ హీరోల చిత్రాల మధ్య చిన్న సినిమాగా విడుదలై అనూహ్యంగా సూపర్ సక్సెస్ అందుకుంది. దాదాపు రూ. 40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ రూ. 350 కోట్లుకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు సినీ ప్రముఖులు ఈ సినిమా చూసి ప్రశంసలు కురిపించారు. తెలుగు, హిందీ సహా రిలీజైన అన్ని భాషల్లోనూ బ్లాక్ బస్టర్ అయింది. దీంతో హనుమాన్ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని చాలా రోజులుగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుస్తున్నారు. ఎట్టకేలకు హనుమాన్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘జీ5’లో ఆదివారం (మార్చి 17, 2024) నుంచి హనుమాన్ తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా థియేటర్లలో రిలీజైన 66 రోజుల తర్వాత ఈ చిత్రం ఓటీటీలోకి రావడం విశేషం. అయితే జియో సినిమాలో హనుమాన్ హిందీ వెర్షన్ మార్చి 16 అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్ అవడం గమనార్హం.
కాగా హనుమాన్ చిత్రంలో తేజ సజ్జా సరసన అమృతా అయ్యర్ హీరోయిన్గా నటించింది. కోలీవుడ్ స్టార్స్ వరలక్ష్మీ శరత్ కుమార్, వినయ్ రాయ్, వెన్నెల కిశోర్, సత్య, గెటప్ శ్రీను తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాకు సీక్వెల్ కూడా రానున్నట్లు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఆల్రెడీ ప్రకటించారు. దీనికి ‘జై హనుమాన్’ అనే టైటిల్ పెడుతున్నట్లు హనుమాన్ ఎండింగ్‌లోనే స్పష్టం చేశారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ అయినట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి సాలిడ్ అప్డేట్ రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: