మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నుండి వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా గేమ్ ఛేంజర్. లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈసినిమా వస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. భారీ బడ్జెట్ తో భారీ బడ్జెట్ తో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈసినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లోకనిపించనున్నాడు. ఇక ప్రస్తుతం ఈ సినిమాషూటింగ్ ను పూర్తి చేసుకుంటున్న సంగతి తెలిసిందే కదా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా షూటింగ్ కోసం రామ్ చరణ్ వైజాగ్ వెళ్లారు. ఇక తమ అభిమాన హీరో వస్తున్నాడంటే ఫ్యాన్స్ ఊరుకుంటారా.. రామ్ చరణ్ కు గ్రాండ్ వెల్ కమ్ ఇవ్వడానికి ఎయిర్ పోర్ట్ కు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇక చరణ్ తో పాటు ఎస్ జే సూర్య కూడా వైజాగ్ వచ్చారు. అక్కడికి వచ్చిన అభిమానులను చూసి ఎస్ జే సూర్య కూడా ఆనందం వ్యక్తం చేశారు. ఇక వైజాగ్ లో వారం రోజుల పాటు షూటింగ్ జరగనున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు దీనితో టాకీ పార్ట్ కూడా పూర్తవుతుందని అంటున్నారు.
#TFNReels: Indeed a massive welcome to the Mega Power Star️ @AlwaysRamCharan at Vizag!💥💥#RamCharan #GameChanger #RC16 #TeluguFilmNagar pic.twitter.com/wdGICqmDAu
— Telugu FilmNagar (@telugufilmnagar) March 15, 2024
కాగా గేమ్ ఛేంజర్ సినిమాలో కియారా హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా ఈసినిమాలో శ్రీకాంత్, జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































