స్ట్రీమింగ్ కు వచ్చేసిన సేవ్ ద టైగర్స్ 2

Save The Tigers Season 2 streaming in Disney Plus Hotstar

ఇప్పుడు తెలుగులో కూడా వరుసగా వెబ్ సిరీస్ లు వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక అలా వచ్చిన వెబ్ సిరీస్ లలో సూపర్ హిట్ అయిన వాటిలో సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ కూడా మొదటి వరుసలో ఉంటుంది. తేజా కాకుమాను ద‌ర్శ‌క‌త్వంలో ప్రియ‌ద‌ర్శి, చైత‌న్య‌కృష్ణ‌, అభిన‌వ్ గోమ‌టం, సుజాత‌, దేవ‌యాని, పావ‌ని గంగిరెడ్డి కీల‌క పాత్ర‌ల్లో ఈ వెబ్ సిరీస్ వచ్చింది. భార్య భర్తల కథాంశంతో.. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసిరీస్ గత ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ అవ్వగా మంచి ప్రేక్షకాదరణ పొందింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు సీజన్ 2 వస్తున్న సంగతి తెలిసిందే కదా. సేవ్ ద టైగర్స్ 2 అనే టైటిల్ తో ఈవెబ్ సిరీస్ వస్తుంది. ఇక ఈసిరీస్ లో ప్రియ‌ద‌ర్శి, చైత‌న్య‌కృష్ణ‌, అభిన‌వ్ గోమ‌టమే ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. డైరెక్టర్ మాత్రం మారారు. ఈ సిరీస్‌కు అరుణ కొత్తపల్లి దర్శకత్వంలో వస్తుంది. ఇదిలా ఉండగా ఈ వెబ్ సిరీస్ కూడా రిలీజ్ కు సిద్దమైంది. ఎప్పటినుండో అప్ డేట్లతో క్యూరియాసిటీ పెంచుతున్న మేకర్స్.. ఇప్పుడు రిలీజ్ కు సంబంధించిన అప్ డేట్ కూాడా ఇచ్చేశారు. ఈసిరీస్ ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో నేటి నుండి స్ట్రీమింగ్ వచ్చేసింది. మరి ఎప్పటినుండో ఈ సిరీస్ కోసం వెయిట్ చేస్తున్న వారు ఓటీటీ లో చూసి ఎంజాయ్ చేసేయొచ్చు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.