ఒక భాషలో హిట్ అయిన సినిమాలను ఇప్పుడు మరో భాషలో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. అలా తెలుగు రిలీజ్ కు సిద్దమైన సినిమా ప్రేమలు. మలయాళంలో రిలీజ్ అయిన ఈసినిమా అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. దీంతో ఈసినిమాను ఇక్కడ కూడా రిలీజ్ చేస్తున్నారు. మరి నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈసినిమా ఇక్కడ ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుందో చూద్దాం…
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులు..మమితా బైజు,నస్లేన్,అల్తాఫ్ సలీం,మీనాక్షి రవీంద్రన్,అఖిల భార్గవన్ తదితరులు
దర్శకత్వం.. గిరీష్
నిర్మాతలు..ఫాహద్ ఫాసిల్, దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్
సంగీతం..విష్ణు విజయ్
సినిమాటోగ్రఫి.. అజ్మల్ సాంబు
కథ
సచిన్ (నస్లెన్ కె. గఫూర్) ఇంజనీరింగ్ పూర్తి చేసి యూ.కె వెళ్లాలని ప్లాన్ చేస్తాడు. అయితే వీసా రిజెక్ట్ అవ్వడంతో ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. ఇక ఇంట్లో పోరు భరించలేక తన ఫ్రెండ్ అమూల్ (సంగీత్ ప్రతాప్) సలహాతో ఇద్దరూ కలిసి గేట్ కోచింగ్ కోసం హైదరాబాద్ వెళ్తారు. మరోవైపు రీనూ (మమితా బైజు) హైదరాబాద్లో ఐటీ జాబ్ చేస్తుంటుంది. ఓ పెళ్లిలో రీనూని చూసిన సచిన్ ఆమెను ఇష్టపడతాడు. తన ప్రేమ విషయాన్ని ఆమెకు చెబుతాడు. అయితే రీనూ సచిన్ ప్రేమను రిజక్ట్ చేస్తుంది. తనకు సెటిల్ అయిన అబ్బాయిని చేసుకోవాలని ఉంటుంది. మరి వీరి ప్రేమకథ ఎలాంటి మలుపు తీసుకుంది ?, ఇంతకీ, సచిన్ తన ప్రేమను గెలుచుకున్నాడా ? లేదా ? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ
కొన్ని సినిమాల కథలు ఎంతో సింపుల్ గా ఉంటాయి. అయినా కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ప్రేమలు సినిమా కూడా అలాంటి కోవలోకే వస్తుంది. చెప్పడానికి ఇది లవ్ స్టోరీనే. మరి సినిమా పుట్టినప్పటినుండి ఎన్నో ప్రేమకథలు తెరపైన అలరించాయి కూడా. మరి ఈ ప్రేమలు సినిమాలోని ప్రత్యేకత ఏముంది అంటే. కథ గురించి పక్కన పెడితే డైరెక్టర్ సినిమాను చూపించిన విధానంలో సక్సెస్ అయ్యాడు. ఫన్నీ సీన్స్ తోనే ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేశాడు. ప్రేమలు సినిమా ప్రేక్షకులను మొదటి నిమిషం నుంచి ఎండింగ్ వరకూ ఎంటర్టైన్ చేస్తూనే ఉంటుంది. ఫ్రెండ్స్ మధ్య వచ్చే సరదా సంభాషణలు, సన్నివేశాలు, డైలాగ్స్, తిట్టు కోవడం ఇలా ప్రతిదీ ఆడియన్స్ను బాగా ఎంగేజ్ చేస్తుంది.
పెర్ఫామెన్స్
ఈసినిమాకు పాత్రలే ప్రధాన బలం. నస్లెన్ కె. గఫూర్ చాలా సహజంగా నటించాడు. తనఈజ్ యాక్టింగ్ తో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. కామెడీ సన్నివేశాల్లో నవ్వించడంతోపాటు ఎమోషనల్ సీన్లలో అదే రేంజ్ లో నటించాడు. ఇక హీరోయిన్ గా నటించిన మమితా బైజు తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకోవడమే కాకుండా తన నటనతోనూ ఆకట్టుకుంది. మరో కీలక పాత్రలో నటించిన సంగీత్ ప్రతాప్ నటన కూడా చాలా బాగుంది. శ్యామ్ మోహన్, అఖిల భార్గవన్, మీనాక్షి రవీంద్రన్ లు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
టెక్నికల్ వాల్యూస్
సంగీత దర్శకుడు విష్ణు విజయ్ అందించిన పాటలు బాగున్నాయి. కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన అందించిన నేపధ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. హైద్రాబాద్ లోకేషన్స్ కూడా చాలా అందంగా ఉన్నాయి. నిర్మాణ విలువలు కూడా రిచ్ గా ఉన్నాయి.
ఓవరాల్ గా చెప్పాలంటే ఈసినిమా క్లీన్ ఎంటర్ టైనర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. యూత్ తో పాటు అందరికీ నచ్చుతుందని చెప్పొచ్చు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























