లవ్ మీ టీజర్ రిలీజ్

ashish and vaishnavi chaitanya love me movie teaser out now

రౌడీ బాయ్స్ అనే సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు ఆశిష్ రెడ్డి. కాలేజ్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ఈసినిమా యూత్ ను బాగానే ఆకట్టుకుంది. ఆ తరువాత సెల్ఫిష్ అనే సినిమాతో వచ్చాడు. అయితే ఈసినిమా అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయింది. ఇక ఇప్పుడు మూడో సినిమాతో వచ్చేస్తున్నాడు. అరుణ్ భీమవరపు దర్శకత్వంలో ఈసినిమా రాబోతుంది. రీసెంట్ గానే టైటిల్ ను ప్రకటించారు. లవ్ మీ అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను కంప్లీట్ ను చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. డైరెక్టర్ సందీప్ వంగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. టీజర్ అయితే ఆద్యంతం ఆకట్టుకుంటుంది. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అన్నీ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.

కాగా బేబి ఫేమ్ వైష్ణవి చైతన్య ఈసినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈసినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై హన్షిత రెడ్డి నిర్మిస్తున్నారు. ఎం. ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా లెజెండరీ కెమెరామెన్ పీసీ శ్రీరాం సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. అలాగే కొల్లా అవినాష్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.