చాలా రోజుల తరువాత యంగ్ హీరో సందీప్ కిషన్ ఎట్టకేలకు హిట్ కొట్టాడు.రీసెంట్ గా ఊరు పేరు భైరవకోన అనే ఫాంటసీ థ్రిల్లర్ తో వచ్చిన సందీప్ కు ఈసినిమా మంచి విజయాన్ని అందించింది.రివ్యూస్ తోపాటు టాక్ బాగుండడంతో 10రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 25.11కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.ఇందులో షేర్ 14కోట్లు. కేవలం 12కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగడంతో బ్రేక్ ఈవెన్ ను దాటి లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.డల్ సీజన్ నడుస్తున్న డీసెంట్ వసూళ్లను రాబట్టుకుంటూ హిట్ అనిపించుకుంది ఈసినిమా.ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమాలో సందీప్ నటన ,హర్ష -వెన్నెల కిషోర్ కామెడీ ,ట్విస్టులు ,సాంగ్స్ హైలైట్ అయ్యాయి.వి ఐ ఆనంద్ డైరెక్ట్ చేయగా వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ హీరోయిన్లు నటించారు.శేఖర్ చంద్ర సంగీతం అందించాడు.హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా ఈసినిమాను నిర్మించాడు.ఈనిర్మాతకు వరుసగా ఇది రెండో విజయం.గత ఏడాది ఇదే బ్యానర్ నుండి వచ్చిన సామజవరగమన బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది.
ఇక భైరవకోన హిట్ కావడంతో దీనికి సీక్వెల్ చేసే ప్లాన్ లో వున్నారు మేకర్స్.అయితే ఇప్పుడప్పుడే ఈ సీక్వెల్ సెట్స్ మీదకు వెళ్లకపోవచ్చు కానీ పార్ట్ 2 అయితే పక్కా ఉంటుందట.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























