మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ దృష్టిని ఆకట్టుకున్నాడు కుర్ర హీరో ఆశిష్ రెడ్డి. దిల్ రాజు వారసుడిగా రౌడీ బాయ్స్ అనే సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయం అయిన ఆశిష్ రెడ్డి మంచి ప్రశంసలు దక్కించుకున్నాడు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు ఆశిష్ రెడ్డి. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన కాశీ దర్శకత్వంలో ఆశిష్ రెడ్డి హీరోగా వస్తున్న సినిమా సెల్ఫిష్. ఈసినిమా త్వరలో రిలీజ్ కానుంది. ఇంకా ఈసినిమాతో పాటు అరుణ్ భీమవరపు దర్శకత్వంలో కూడా మరో సినిమా చేస్తున్నాడు. యూత్ ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్ ఈసినిమా రాబోతుంది.ఈసినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై హన్షిత రెడ్డి నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ఆశిష్ రెడ్డి కూడా ఒక ఇంటివాడైన సంగత తెలిసిందే కదా. గతేడాది నవంబర్ 30న ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె ‘అద్వైత రెడ్డి’ తో ఆశిష్ రెడ్డి నిశ్చితార్థం జరిగింది. ఇప్పుడు పెళ్లి కూడా ఘనంగా జరిగింది. జైపూర్ ప్యాలెస్ లో ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి విహహం ఘనంగా జరిగింది. ఇప్పటికే ఈ పెళ్లిలో దిల్ రాజు వేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివాహం వేడుక ముగియడంతో నూతన వధూవరులు ఇంటికి చేరుకున్నారు. ఈనేపథ్యంలో నవ వధూవరులకు ఆహ్వానం పలికారు ఇంటి సభ్యులు.
Sending endless love and warm wishes to @AshishVoffl and #AdvithaReddy as they step into the beautiful journey of marriage!💑 May your days be filled with love, laughter, and countless cherished moments!💖 #AshishVelamakucha #TFNReels #TeluguFilmNagar pic.twitter.com/JdEEFIJzae
— Telugu FilmNagar (@telugufilmnagar) February 17, 2024
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























