టిల్లు స్క్వేర్ బర్త్ డే గ్లింప్స్ రిలీజ్

siddhu jonnalagadda birthday glimpse out from tillu square movie

చిన్న పాత్రలు చేసుకుంటూ ఆ తరువాత హీరోగా చేసి ఇప్పుడు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు సిద్దూ జొన్నలగడ్డ. డీజే టిల్లు సినిమాతో ఫుల్ ఫామ్ లోకి వచ్చిన సిద్దూ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం తన లిస్ట్ లో టిల్లు స్క్వేర్ సినిమా ఇంకా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలు ఉన్నాయి. వీటిలో టిల్లు స్క్వేర్ మల్లిక్ రామ్ దర్శకత్వంలో రాబోతుంది. డీజే టిల్లు సినిమాకు ఈసినిమా సీక్వెల్ అన్నసంగతి తెలిసిందే కదా. ఈసినిమా మార్చి 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక నేడు సిద్దూ పుట్టినరోజు సందర్భంగా తన సినిమాల నుండి అప్ డేట్లు ఇస్తున్నారు మేకర్స్. ఈనేపథ్యంలోనే ఈరోజు ఉదయం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా టైటిల్ ను రిలీజ్ చేశారు. జాక్- కొంచం క్రాక్ అనే ట్యాగ్ లైన్ తో ఈసినిమా వస్తుంది. ఇప్పుడు తాాజాగా టిల్లు స్క్వేర్ నుండి అప్ డేట్ వచ్చింది. సిద్దూ బర్త్ డే గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. గ్లింప్స్ అయితే ఆకట్టుకుంటుంది. ఈసినిమా థియేట్రికల్ ట్రైలర్ ను ఫిబ్రవరి14వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు కూడా తెలిపారు.

కాగా ఈసినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. రామ్ మిరియాల ,శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా..సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ,సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.