లాల్ సలామ్ ట్రైలర్ రిలీజ్

Lal Salaam Movie Theatrical Trailer

ఐశ్వర్య దర్శకత్వంలో విష్ణు విశాల్ ఇంకా విక్రాంత్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా లాల్ సలామ్. స్పోర్ట్ బేస్డ్ ఇంకా మరియు మత కల్లోల కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇక ఈసినిమాలో రజనీకాంత్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాను ముందు పొంగల్ కు రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ పొంగల్ కు పలు సినిమాలు రిలీజ్ కు ఉండటంతో ఈసినిమా రిలీజ్ ను వాయిదా వేశారు. ఫైనల్ గా ఫిబ్రవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, టీజర్ ను రిలీజ్ చేయగా అవి మంచి రెస్పాన్సే సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ కూడా ఆకట్టుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇంకా ఈసినిమాలో జీవిత రాజశేఖర్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తుంది. రజనీకాంత్ సోదరి పాత్రలో నటిస్తుంది. చాలా కాలం తరువాత జీవిత మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుంది. లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ కూడా ఒక కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.