తమిళ్ స్టార్ హీరో విశాల్ ఒక సినిమా తరువాత మరొక సినిమా చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం విశాల్ నుండి రాబోతున్న సినిమా రత్నం. హరి దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా ఫస్ట్ లుక్ అయితే భయంకరంగా ఉండి ఆకట్టుకుంది. ఇక ఈసినిమా రిలీజ్ డేట్ ను తాజాగా ప్రకటించారు మేకర్స్. ఈసినిమాను ఏప్రిల్ 26వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు తాజాగా అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈమేరకు ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Save the date for our biggie this summer 🔥#Rathnam hits the screens on the 26th of April 2024. In Tamil and Telugu.
Starring Puratchi Thalapathy @VishalKOfficial.
A film by #Hari. Coming to theatres, summer 2024.
A @ThisisDSP musical. @priya_Bshankar @stonebenchers… pic.twitter.com/opLNtEkdDE
— Stone Bench (@stonebenchers) January 25, 2024
కాగా మాస్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈసినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాను విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ అలాగే స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ వారు సంయుక్తంగా నిర్మించనున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: