అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం మరియు శ్రీరాముడి నూతన విగ్రహావిష్కరణ సందర్భంగా దేశవ్యాప్తంగా ఈరోజు (జనవరి 22, 2024) సందడి నెలకొంది. నభూతో.. అన్నట్లుగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన ఎంతో మంది ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్.. అయోధ్య రామ మందిర వేడుకలో పాల్గొంటున్నారు. ఇందుకోసం వారు నిన్ననే అయోధ్యకు బయలుదేరి వెళ్లారు. ఈ నేపథ్యంలో చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ ట్వీట్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అందులో..”ఈ దినం చరిత్ర సృష్టిస్తోంది. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనుంది. ఇది నిజంగా అపరిమితమైన అనుభూతి. అయోధ్యలో రామ్‌లల్లాకు పట్టాభిషేకం సందర్భంగా ఈ ఆహ్వానాన్ని దేవుడిచ్చిన అవకాశంగా భావిస్తున్నాను. ఐదు వందల సంవత్సరాలకు పైగా తరతరాలుగా భారతీయుల నిరీక్షణ ఫలించబోతున్న ఆ మహత్తర అధ్యాయం. కోట్లాది భారతీయుల కలలను నెరవేర్చిన గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక అభినందనలు. అలాగే ఈ మహత్కార్యంలో ముఖ్య భూమిక పోషించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ దాస్ జీకి హృదయపూర్వక అభినందనలు” తెలిపారు.
Creating history
Evoking history
Everlasting in HistoryThis is truly an overwhelming feeling..
I consider this invitation a godsend opportunity to witness the consecration of Ram Lalla at Ayodhya.
That glorious chapter, when the excruciating wait of generations of Indians…
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 21, 2024
ఇంకా ఆయన ఇలా అన్నారు..”ఆ దివ్యమైన ‘చిరంజీవి’ హనుమంతుడు, అంజనా దేవి కుమారుడే స్వయంగా ఈ భూలోక అంజనా దేవి కొడుకు చిరంజీవికి ఈ అమూల్యమైన క్షణాలను చూసే బహుమతిని ఇచ్చినట్లు నాకు అనిపిస్తుంది. నిజంగా వర్ణించలేని అనుభూతి. నాకు మరియు నా కుటుంబ సభ్యులకు ఎన్నో జన్మల పుణ్యఫలం. ఆ బంగారు క్షణాల కోసం ఎదురుచూస్తున్నా.. ఈ మహత్తర సందర్భంలో ప్రతి భారతీయునికి హృదయపూర్వక అభినందనలు! జై శ్రీ రామ్” అని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























