హనుమాన్ రెండవ వారంలోకిఎంట్రీ ఇచ్చినా టికెట్ల కోసం డిమాండ్ ఇంకా తగ్గడం లేదు.హైదరాబాద్ లో నిన్నటి నుండి స్క్రీన్స్ కూడా పెంచారు అయితే ఎన్ని స్క్రీన్స్ ఆడ్ చేసిన టికెట్లు మాత్రం హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయ్.ఈరోజు అయితే 95శాతం అడ్వాన్స్ బుకింగ్స్ అయ్యాయి.రేపు కూడా ఇదే ట్రెండ్ కొనసాగనుంది.ఈమధ్య కాలంలో ఇంత డిమాండ్ వున్న చిన్న సినిమా ఏది రాలేదని చెప్పొచ్చు.సంక్రాంతి కివచ్చి స్టార్ హీరోల సినిమాలతో పోటీ పడి హనుమాన్ విన్నర్ గా నిలిచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కలెక్షన్ల విషయానికి వస్తే ప్రపంచ వ్యాప్తంగా నిన్నటితో 150కోట్ల గ్రాస్ మార్క్ ను దాటి హిస్టారికల్ బ్లాక్ బాస్టర్ వైపు పరుగులు తీస్తుంది.నైజాంలో అయితే 20కోట్ల షేర్ మార్క్ ను దాటి రికార్డు సృష్టించి బయ్యర్లకు ఊహించని లాభాలు తీసుకొస్తుంది.ఇక హిందీ లో నిన్న2.05కోట్ల నెట్ ను రాబట్టింది దాంతో 8రోజుల్లో అక్కడ 24.97కోట్ల నెట్ ను ఖాతాలో వేసుకుంది.రేపటి తో 30కోట్ల మార్క్ ను క్రాస్ చేయనుంది.
వచ్చే వారం అన్ని డబ్బింగ్ సినిమాలే ఉండడంతో హనుమాన్ గ్లోబల్ వైడ్ గా ఇదే జోరు ను కొనసాగించనుంది.ప్రశాంత్ వర్మ ఈసినిమాను డైరెక్ట్ చేయగా తేజ సజ్జా హీరోగా నటించాడు.ప్రైమ్ టైం షో ఎంటర్టైన్మెంట్ నిర్మించింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























