ఆపరేషన్ వాలెంటైన్ ఫస్ట్ సింగిల్ వందేమాతరం సాంగ్ రిలీజ్

Operation Valentine First Single Vandemataram Song

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ఆపరేషన్ వాలెంటైన్. సినిమాటోగ్రాఫర్ వీఎఫ్ఎక్స్ నిపుణుడు అయిన శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. నిజానికి ఈసినిమా కూడా గత ఏడాడి డిసెంబర్ లోనే రిలీజ్ చేయాల్సింది. అయితే షూటింగ్ ఆలస్యంగా ముగియడం.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు లేట్ అవడంతో సినిమా రిలీజ్ ను వాయిదా వేసుకున్నారు. ఫైనల్ గా ఫిబ్రవరి 16వ తేదీన ప్రేక్షకుల ఈముందుకు రానుంది. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను షురూ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీనిలో భాగంగానే తాజాగా ఈసినిమా ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. వందేమాతరం అంటూ వచ్చే ఈపాటను సరిహద్దు ప్రాంతమైన వాఘా లో రిలీజ్ చేశారు. పేట్రియాటిక్ నేపథ్యంలో వస్తున్న సినిమా కాబట్టి ఇక్కడ ఈపాటను రిలీజ్ చేశారు మేకర్స్. తెలుగుతో పాటు హిందీలో కూడా ఈపాటను రిలీజ్ చేశారు. కునాల్ కుందు పాడిన ఈపాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు.
పాట అయితే ఆకట్టుకుంటుంది.

కాగా ఈసినిమాలో మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లార్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో రాడార్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది. శక్తి ప్రతాప్ సింగ్ హడా, అమీర్ ఖాన్, సిద్ధార్థ్ రాజ్ కుమార్ రాసిన ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్ సందీప్ ముద్ద భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.