లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈసినిమాను శంకర్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు రాగా మరికొద్దిరోజుల్లో షూటింగ్ కంప్లీట్ కానుంది. ఈసినిమాలో కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది.. ఇంకా శ్రీకాంత్, జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమా తరువాత రామ్ చరణ్ బుచ్చిబాబు తో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే కదా. స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్ లో ఈసినిమా వస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇదిలా ఉండగా ఈసినిమా నుండి తాజాగా క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఈసినిమా కోసం మ్యూజిక్ డైరెక్టర్ గా ఏ.ఆర్ రెహమాన్ ఎంపికయ్యాడు. నేడు ఏ.ఆర్ రెహమాన్ పుట్టినరోజు సందర్భంగా చరణ్ కు బర్త్ డే విషెస్ చెబుతూ ఈసినిమాకు ఏ.ఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్నట్టు తెలిపాడు.
Happy Birthday @arrahman sir, wish you health and happiness always. pic.twitter.com/Lj6RPkIBNs
— Ram Charan (@AlwaysRamCharan) January 6, 2024
Wishing the Academy Winner, Padma Bhushan @arrahman Garu a very Happy Birthday 🎵❤️🔥
Honoured and elated to have you on board for #RC16 💫#RamCharanRevolts
Mega Power Star @AlwaysRamCharan @BuchiBabuSana @aryasukku @MythriOfficial @SukumarWritings pic.twitter.com/et9gT4vOPm— Vriddhi Cinemas (@vriddhicinemas) January 6, 2024
ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్ సమర్పణలో వ్రిద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కీలారు నిర్మించనున్నారు. త్వరలోనే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటించనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































