పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అటు సినిమాలతోనూ అలానే మరోపక్క రాజకీయాలతోనూ బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే రీఎంట్రీ తరువాత వరుసగా వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో సినిమాలతో బ్లాక్ బస్టర్ లను సొంతం చేసుకోగా ఇంకా పలు సినిమాలు లిస్ట్ లో ఉన్నాయి. వాటిలో హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా భవదీయుడు భగత్ సింగ్. ఈసినిమా ఇప్పటికే కొంతవరకూ షూటింగ్ ను కూడా పూర్తి చేసుకున్నారు. ఇంకా సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఓజీ సినిమా ఒకటి. ఈసినిమా కూడా చాలా వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇంకా క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా కూడా ఒకటి ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు ఓ అరుదైన గౌరవం దక్కింది. తమిళనాడుకు చెందిన వేేల్స్ యూనివర్శిటీ వారు పవన్ కు డాక్టరేట్ ఇవ్వడానికి ఎంపిక చేశారు. ఈనెలలో జరగనున్న యూనివర్శిటీ 14వ కాన్వకేషన్ కార్యక్రమంలో పాల్గొని డాక్టరేట్ అందుకోవాల్సిందిగా కోరారు. అయితే ఈ డాక్టరేట్ ను సున్నితంగా తిరస్కరించారు పవన్. వేల్స్ యూనివర్శిటి నన్ను డాక్టరేట్ కి ఎంపిక చేసినందుకు చాలా సంతోషంగా ఉంది.. అలాగే గౌరవంగా భావిస్తున్నా.. అయితే నాకంటే గొప్పవాళ్లు చాలా మంది ఉన్నారు.. వారిలో సరైన వారికి డాక్టరేట్ ఇవ్వాలని కోరుతున్నాా అంటూ లేఖ రాశారు. ఏపీలో ఎన్నికల షెడ్యూల్ కారణంగా యూనివర్శిటీ 14వ కాన్వకేషన్ కార్యక్రమానికి కూడా హాజరుకాలేకపోతున్నాను అంటూ లేఖలో పేర్కొన్నారు. ఇక పవన్ చేసిన పనికి ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























