మహేష్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో గుంటూరు కారం సినిమా కూడా ఒకటి. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా వస్తుంది. ఇక ఇంతకుముందు ఎన్నడూ లేనంత మాస్ గా మహేష్ ఈసినిమాలో కనిపిస్తుండటంతో సినిమాకోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ లుక్ తోనే సినిమాపై కావాల్సినంత బజ్ ను క్రియేట్ చేశారు. దానితోపాటు టీజర్, పాటలు కూడా సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ పై ఇప్పటికే పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ట్రైలర్ ను జనవరి 6వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు నాగవంశీ ఫ్యాన్ మీట్ లో తెలిపారు. ఇక ఇప్పుడు అధికారికంగా ఆవిషయాన్ని తెలియచేశారు మేకర్స్. జనవరి 6వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్టు తెలుపుతూ ఆ ఈవెంట్ లోనే ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికను మాత్రం ఇంకా ఖరారు చేయలేదు.
Get hyped! 🔥 The much-anticipated #GunturKaaramTrailer will be revealed on JAN 6th @ MASSIVE Pre-Release event of #GunturKaaram! 🔥💥
Super🌟 @urstrulyMahesh #Trivikram @MusicThaman @sreeleela14 @meenakshiioffl @vamsi84 @manojdft @NavinNooli #ASPrakash @haarikahassine… pic.twitter.com/aynVm6DOFa
— Haarika & Hassine Creations (@haarikahassine) January 3, 2024
ఈసినిమాలో మహేష్ బాబు సరసన మీనాక్షి చౌదరి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై ఎస్.రాధాకృష్ణ ఈసినిమాను నిర్మిస్తున్న ఈసినిమాకు మధి కెమెరామెన్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా, థమన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. ఈసినిమాను సంక్రాంతి కానుకగా 2024, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























