మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తోన్న మోస్ట్ ఎవైటెడ్ ఇంటెన్స్ అండ్ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఈగల్’. టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలకు సిద్ధమవుతోంది. మూవీ రిలీజ్‌కు సమయం దగ్గర పడుతుండటంతో మేకర్స్ మరింత దూకుడు పెంచారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కౌంట్‌డౌన్ పోస్టర్, ఆడు మచ్చా, గల్లంతే అనే సోల్ ఫుల్ సాంగ్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అలాగే ఇటీవలే రిలీజైన ఈగల్ టీజర్, ట్రైలర్ అద్భుతమైన రెస్పాన్స్‌తో క్యూరియాసిటీ పెంచేశాయి. ఈ క్రమంలో తాజాగా ఈగల్ సినిమాకి సంబంధించి ఒక కీలక అప్‌డేట్ వెల్లడించింది చిత్రయూనిట్. ఈగల్ సెన్సార్ పూర్తి చేసుకుందని ప్రకటించింది. ఈ మేరకు ఈరోజు సోషల్ మీడియా వేదికగా ఈ చిత్రానికి 𝗨/𝗔 సర్టిఫికేట్ లభించిందని తెలిపింది. అంతేకాకుండా ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ఒక్క కట్ కూడా చెప్పలేదని వెల్లడించింది. ఈ సందర్భంగా ‘మొండి మోతుబరి మాస్ విధ్వంసానికి సిద్ధంగా ఉండండి’ అని ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టింది.
కాగా ఈ చిత్రంలో కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్‌గా నటించారు. అలాగే శ్రీనివాస్ అవసరాల, మధుబాల, ప్రణీత పట్నాయక్, అజయ్ ఘోష్, శ్రీనివాస్ రెడ్డి, భాషా, శివ నారాయణ, మిర్చి కిరణ్, నితిన్ మెహతా, ధ్రువ, ఎడ్వర్డ్, మద్ది, జరా, అక్షర ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఈ చిత్రానికి మణిబాబు కరణంతో పాటు దర్శకుడు స్వయంగా స్క్రీన్ ప్లే రాయగా.. మణిబాబు కరణం డైలాగ్స్ అందించారు. అలాగే దేవ్‌జాంద్ సంగీత సమకూరుస్తుండగా.. శ్రీనాగేంద్ర తంగల ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: