వెంకీ మామకు ఆల్ ది బెస్ట్ చెప్పిన రామ్ చరణ్

Ram Charan Sends Best Wishes To Venkatesh For His 75th Milestone Movie Saindhav

విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సైంధవ్’. వెంకటేష్ కెరీర్‌లో మైల్ స్టోన్ ప్రాజెక్ట్ 75వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ యూనిక్ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు వెరీ ట్యాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. ‘సైంధవ్’ చిత్రంలో ‘జెర్సీ’ ఫేమ్ శ్రద్ద శ్రీనాథ్ హీరోయిన్‌గా నటించగా.. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ విలన్‌ పాత్రను పోషించారు. అన్ని ఫార్మాలిటీస్‌ని పూర్తి చేసుకొని సంక్రాంతికి జనవరి 13న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్‌లో జోరు పెంచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి టీజర్, పాటలు రిలీజ్ చేయగా.. తాజాగా బుధవారం మేకర్స్ ‘సైంధవ్’ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఎమోషనల్ యాక్షన్ ప్యాక్డ్ గా రూపొందించిన ఈ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దీనిపై స్పందించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ..”సైంధవ్ ట్రైలర్ యాక్షన్ ప్యాక్డ్, ఎమోషనల్ డ్రామాగా కనిపిస్తోంది! నాకెంతో ఇష్టమైన వెంకీ మామ ఫైర్ మీద ఉన్నారు. ఇక వెంకటేష్ గారి కెరీర్ లో ఇది 75వ మైలురాయి సినిమా అయినందుకు మరియు టీమ్ మొత్తానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సైంధవ్ చూడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను, జనవరి 13 వరకు వేచి ఉండలేను!” అని పేర్కొన్నారు. ప్రస్తుతం చరణ్ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.

కాగా ‘సైంధవ్’ చిత్రంలో బేబీ సారా, కోలీవుడ్ స్టార్ హీరో ఆర్య, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా.. ఎస్ మణికందన్ కెమెరామెన్‌గా, గ్యారీ బిహెచ్ ఎడిటర్‌గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేస్తున్నారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు కిషోర్ తాళ్లూరు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా సైంధవ్ చిత్రం జనవరి 13న పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 2 =