మట్కా కోసం టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్

gv prakash on board for varun tej matka movie

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆపరేషన్ వాలెంటైన్ సినిమాతో బిజీగా ఉన్నాడు. వాస్తవ సంఘటనల ఆధారంగా వస్తున్న ఈసినిమాలో వరుణ్ తేజ్ బ్రేవ్ ఎయిర్ ఫోర్స్ ఫైలట్ గా నటిస్తున్నాడు. ఈసినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 16వ తేదీన రిలీజ్ కానుంది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈసినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మరోవైపు ఈసినిమా కాస్టింగ్ కు సంబంధించి అప్ డేట్లు ఇస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఈసినిమా కోసం టాలెంటెడ్ సినిమాటోగ్రాఫర్ కిషోర్ కుమార్ ను తీసుకున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఇక ఇప్పుడు మరో అప డేట్ ఇచ్చారు. ఈసినిమాకోసం సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ను తీసుకున్నారు. ఆ డైరెక్టర్ ఎవరో టాలీవుడ్ లో ఎన్నో హిట్ సాంగ్స్ అందించిన జీవీ.ప్రకాష్. ఈవిషయాన్ని చిత్రయూనిట్ తాజాగా తమ అధికారికి ట్విట్టర్ ద్వారా తెలియచేశారు.

కాగా ఈసినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహీ కూడా కీలక పాత్రలో నటిస్తుంది. నవీన్ చంద్ర మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను పాన్ ఇండియా లెవల్లో భారీ స్థాయిలో నిర్మించనున్నారు. వైరా ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈసినిమాను తెలుగు తో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళంలో ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. జీవి ప్రకాష్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.