నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో అభిషేక్ నామా దర్శకత్వంలో వచ్చిన సినిమా డెవిల్. 1940 బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ స్పై థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా వచ్చింది. ఈసినిమాలో కళ్యాణ్ రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో నటించాడు. ఈసినిమా గ్లింప్స్, టీజర్, ట్రైలర్స్‌తోనే రిలీజ్ కు ముందే మంచి బజ్ క్రియేట్ చేయడం.. దానికి తోడు బింబిసార ప్రభావం వల్ల ఈసినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా డిసెంబర్ 29వ తేదీన రిలీజ్ అయిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమాకు పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది. థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన సినిమా కాబట్టి అందరినీ ఆకట్టుకుంటుంది. అందుకే రోజు రోజుకీ కలెక్షన్స్ ను పెంచుకుంటూ పోతుంది. ఈ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 4.6 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసుకుంది. ఇక ఈసినిమా రిలీజ్ అయి నాలుగు రోజులు అయింది. నాలుగు రోజుల్లో ఈసినిమా 22 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టుకుంది. మరి పొంగల్ వరకూ మరే సినిమాలు లేకపోవడం ఈసినిమాకు కలిసొచ్చే అంశం. ఈ పదిరోజుల్లో ఈసినిమా ఎంత కలెక్షన్స్ ను రాబట్టుకుంటుందో చూడాలి.
Hunting the Box Office like a #Devil 💥
The historical blockbuster #DevilTheMovie collects a worldwide gross of 22.59cr in 4 days 🔥
Book your tickets now! 🎫https://t.co/wfG49rByQ7 #Devil – The British Secret Agent @NANDAMURIKALYAN@iamsamyuktha_ #MalvikaNair
Directed &… pic.twitter.com/UjRxtNnh9Z— Devil The Movie (@Devil_TheMovie) January 2, 2024
కాగా ఈసినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మించారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























