బింబిసార తర్వాత మళ్ళీ డెవిల్‌లో అది చూసాను – నందమూరి కళ్యాణ్ రామ్

Kalyan Ram Comments On Devil Movie

నందమూరి కళ్యాణ్‌రామ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘డెవిల్’. ‘ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్’ అనేది ట్యాగ్ లైన్. స్పై జానర్‌గా రూపొందిన ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించగా.. మాళవిక నాయర్ మరో కీలక పాత్రలో కనిపించారు. అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మించి తెరకెక్కించిన ఈ చిత్రం శుక్రవారం (డిసెంబర్ 29, 2023) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. కాగా ఈ యాక్షన్ ప్యాక్డ్ సినిమా ప్రేక్షకులకు థ్రిల్లింగ్ సినిమాటిక్ అనుభూతిని ఇవ్వడంతో పాటు మంచి రెస్పాన్స్‌ను రాబడుతోంది. ఈ నేపథ్యంలో డెవిల్ యూనిట్ చిత్ర విజయోత్సవాన్ని హైదరాబాద్‌లో జరుపుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో నందమూరి కళ్యాణ్ రామ్ తెలుగు ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా నందమూరి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. ”మా ‘డెవిల్’ సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన నందమూరి అభిమానులకు, తెలుగు ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.. అందరికి రుణపడి ఉంటాను. ఒక సినిమా సక్సెస్ అయితే ఇండస్ట్రీ బాగుంటుంది, కాబట్టి మా సినిమా విజయంలో భాగమైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ఇది మా రెండేళ్ల కృషి. 1940ల బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చేయడం అంత ఈజీ కాదు. శ్రీకాంత్ విస్సా ఒక సంవత్సరం పాటు కథతో ట్రావెల్ చేశాడు” అని తెలిపారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “ఈ సినిమా ప్రారంభమైన కొద్ది రోజులకే మా డిఓపి సౌందర్ రాజన్‌కి గుండె ఆపరేషన్ జరిగింది. డాక్టర్లు మూడు నాలుగు నెలలు రెస్ట్‌ తీసుకోవాలని సూచించారు, అయితే పద్దెనిమిది రోజుల్లోనే సెట్స్‌లోకి అడుగు పెట్టడం సినిమాపై ఆయనకున్న ప్రేమను తెలియజేస్తుంది. డెవిల్ సినిమా రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్‌కి మా నిర్మాత మరియు దర్శకుడు అభిషేక్ నామా గారే కారణం.. బడ్జెట్ విషయంలో రాజీపడకుండా అన్నీ చేసారు. వాసు గారు, మోహిత్, నవీన్ మిగతా ప్రొడక్షన్ వ్యవహారాలను బాగానే హ్యాండిల్ చేసారు. మా టీమ్ అంతా కష్టపడి పనిచేశారు. శ్రీకాంత్ విస్సా చాలా మంచి కథ అందించారు. ‘బింబిసార’ రేంజ్ డైలాగ్స్ ఎప్పటికీ రావు అనుకున్నాను కానీ, డెవిల్ డైలాగ్స్‌కి థియేటర్స్‌లో అద్బుతమైన రెస్పాన్స్ వస్తోంది” అని పేర్కొన్నారు.

“అలాగే మా ఆర్ట్ డైరెక్టర్ గాంధీ గారు అద్భుతమైన సెట్స్ వేశారని, కథ, స్క్రీన్ ప్లేని అందరూ మెచ్చుకుంటున్నారు.. వెంకట్ మాస్టర్ యాక్షన్ సీక్వెన్స్‌లను అద్భుతంగా డిజైన్ చేశారు. ‘పటాస్’ ఎడిటర్ తమ్మిరాజుగారితో నాకు మంచి అనుబంధం ఉంది, అది ఇప్పటికీ కొనసాగుతోంది. మా కాస్ట్యూమ్ డిజైనర్ రాజేష్ చాలా రీసెర్చ్ చేసి కొత్త అనుభూతిని కలిగించారు. కాస్ట్యూమ్స్ ఇటలీ నుంచి తెప్పించాం. హర్షవర్ధన్ సంగీతం ఎలా ఇస్తారోనని అనుకున్నాను. ఎందుకంటే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మా సినిమాకు మెయిన్ పిల్లర్. కానీ దర్శక, నిర్మాత అభిషేక్ మాత్రం నమ్మకంతో ముందుకు వెళ్లమని చెప్పారు. యానిమల్‌ తర్వాత మరో విజయాన్ని సాధించాడు. ఇక నటీనటుల విషయానికి వస్తే షఫీ గారు చాలా ముఖ్యమైన పాత్రలో నటించారు. అలాగే సంయుక్త మీనన్, మాళవిక నాయర్‌లతో సహా అందరికీ థాంక్స్’’ అని కల్యాణ్‌ రామ్‌ చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.