ఈఏడాది రెండు సినిమాలతో అలరించిన నాని ప్రస్తుతం కొత్త సినిమాలతో బిజీగా ఉన్నాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరోగా రాబోతున్న సినిమా సరిపోదా శనివారం. వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న రెండో సినిమా ఇది. ఈసినిమాలో నాని కంప్లీట్ యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో అలరించనున్నట్టు తెలుస్తుంది. ఇటీవలే ఈసినిమా టైటిల్ తో పాటు గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. అంతేకాదు షూటింగ్ కూడా మొదలుపెట్టేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమా షూటింగ్ కు సంబంధించి అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా కొత్త షెడ్యూల్ నేడు హైద్రాబాద్ లో ప్రారంభించారు. అయితే ఈ షెడ్యూలో చాలా లెంగ్తీ షెడ్యూల్ గా ఉండబోతున్నట్టు సమాచారం. ఇంటెన్స్ యాక్షన్ బ్లాక్‌లతో పాటు ప్రధాన తారాగణంపై కొంత టాకీ పార్ట్ ని చిత్రీకరించనున్నారు. నాని, ఇతర కీలక తారాగణం షూటింగ్‌లో పాల్గొంటారు.
Back in action! 😎#SaripodhaaSanivaaram shoot resumes today with a pivotal moments between Natural 🌟 @NameIsNani and @priyankaamohan ❤️🔥@iam_SJSuryah #VivekAthreya @JxBe @muraligdop @karthikaSriniva @DVVMovies #TeluguFilmNagar pic.twitter.com/85HiWYQKKL
— Telugu FilmNagar (@telugufilmnagar) December 27, 2023
కాగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో ఎస్ జే సూర్య కూడా ఒక కీలక పాత్రోల నటిస్తున్నాడు. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. సెన్సేషనల్ కంపోజర్ జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా, మురళి జి సినిమాటోగ్రాఫర్, కార్తీక శ్రీనివాస్ ఎడిటర్. పాన్ ఇండియా సినిమాగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































